చిట్కాలు
********************** 1. నేల ఉసిరిక రసం ఒక చెంచా తేనె ఒక చెంచా కలిపి సేవిస్తుంటే జ్వరాలు తగ్గుతాయి. 2.మారేడు కాయ గుజ్జులో, సొంటి పొడి బెల్లం చేర్చి ఆ మిశ్రమాన్ని తినిపిస్తుంటే అజీర్ణవ్యాధికి జిగట విరేచనాలు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. 3. ఉప్పును వేయించి గుడ్డలో మూటగట్టి కాపడం ఇస్తుంటే వాతం నొప్పులు కీళ్లనొప్పులు తగ్గుతాయి. 4. చింతాకు వేయించి గుడ్డలో ఉంచి కాపడం పెడితే వాపులు కీళ్ళ నొప్పులు శాంతిస్తాయి. 5. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు చిటికెలు పిప్పళ్లు పొడిని తేనె అనుపానంగా తీసుకుంటూ ఉంటే ఏ వ్యాధి దరిచేరదు ఇప్పుడు మనల్లి ఆరోగ్యంగా ఉంచుతుంది ఊపిరితిత్తులకు చాలా మంచిది. 6. నారింజ పండు తొక్కలు గాని ఆకులుగానీ కాల్చి మసిచేసి ఆమసి ని కొబ్బరినూనెలో కలిపి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి ఒంటిమీద దురదలు తగ్గుతాయి. 7. నారింజ తొక్కు ఎండించి చూర్ణంచేసి దానికి యాలకులు చూర్ణం చేర్చి ఆ మిశ్రమాన్ని మోతాదుకు చిటికెడు తేనెతో రంగరించి నాలుక మీద రాస్తూ వుంటే వాంతులు తగ్గిపోతాయి.