Uses of lemon part-2 🍋🍋🍋🍋నిమ్మకాయ
విటమిన్ సి పుష్కలంగా వుంటుంది.
4 గొంతు సమస్యలు - గొంతుకు వచ్చే ఇన్ఫెక్షనలకు నిమ్మ మంచి ఔషధం. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు గొంతునొప్పి, మంట, మొదలైనవి నివారిస్తాయి. గొంతులో దురద, దగ్గు, బొంగురు పోవడాన్ని ఈ జ్యూస్ అరికడుతుంది. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ ప్రొపర్టీస్ కలిగి ఉండటం వల్ల గొంతు సమస్యలు కలిగించే జర్మ్స్ ను చంపేస్తుంది. వేడినీళ్ళు గొంతు శుభ్రం చేయడానికి మ్యూకస్ గ్రంథులు తెరిచుకోవడానికి సహాయంచేస్తుంది.
5 అధిక రక్తపోటు నియంత్రణ - గుండె జబ్బుల సమస్యలున్నవారికి నిమ్మ రసం నీరు, దీనిలోని పొటాషియం కారణంగా ఎంతో బాగా పని చేస్తుంది. అధిక రక్తపోటు, కళ్ళు బైర్లు కమ్మటం, వాంతి వికారాలు వంటివి పోగొట్టి మైండ్ కు శరీరానికి విశ్రాంతినిస్తుంది. నిమ్మరసంలో ఉండే బయోఫ్లేవినాయిడ్లు రక్తనాళాలకు బలం చేకూరుస్తాయి. తద్వారా అంతర్గత రక్తవూసావం కాకుండా నివారిస్తాయి. కాబట్టి అధిక రక్తపోటు, గుండెజబ్బులు ఉన్నవాళ్లకు నిమ్మ చాలా మంచిది.
6దంతాలను మెరిపిస్తాయి: నిమ్మతొక్కతో దంతాల మీద స్ర్కబ్(రుద్దడం)వల్ల పళ్ళు తెల్లగా మారుతాయి. ఇంకా బ్రెష్ మీద నిమ్మరసం పిండుకొని, దానికి కొద్దిగా సాల్ట్ చిలకరించి బ్రెష్(దంతావదానం/పళ్ళు రుద్దుకోవడం)చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మిళమిళలాడుతుంటాయి.
6 నోటి దుర్వాసన: నిమ్మరసంలో తగినంత ఉప్పు, చిటికెడు వంటసోడా కలిపి దంతాలు రుద్దుకుంటే సమస్య నియంత్రణలో ఉంటుంది.
7 .గర్బిణులకు వచ్చే వేవిళ్ల సమస్య తగ్గాలంటే నిమ్మరసం, అల్లం రసం, తేనె కలిపి ఇవ్వాలి. అధిక రక్తస్రావం, విరేచనాలను అరికట్టే శక్తి నిమ్మ సొంతం. మంచి పోషకపదార్ధాలతోపాటు ఎక్కువగా నిమ్మరసం సేవిస్తూంటే స్త్రీలకు గర్భస్రావాలు జరగవు.