Hair fall remedies (2)ఇలా చేస్తే బట్ట తలరాదు.. వెంట్రుకలు తిరిగి వస్తాయి…
Published
- కొత్తిమీరను మెత్తగా పేస్ట్ చేసి అందులో నుండి రసం తీసి బట్టతల ప్రదేశంలో అప్లై చేయాలి. దీన్ని రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
- యూరోపియన్ హెయిర్ రీసెర్చ్ సొసైటీ జరిపిన పరిశోదనల్లో కాఫీలో ఉండే కెఫిన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని కనుగొన్నారు. కాఫీ పౌడర్ ను బట్టతల ప్రాంతంలో అప్లై చేయడం వల్ల బట్టతలను నివారించుకోవచ్చు. రాలిపోయిన జుట్టు తిరిగి పెరడగానికి సహాయపడుతుంది.
- మెంతులను నీటిలో నానెబట్టి మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. లేదా ఆ నీటిని తలకు అప్లై చేసినా బట్టతల సమస్యను ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.
- బట్టతల మొదలవుతున్నప్పుడే త్రిఫల చూర్ణం(ఉసిరి, కరక్కాయ, తానికాయలు) అన్ని పది ముక్కల చొప్పున తీసుకొని రాత్రి నాన పెట్టి, ఉదయానే నీటిని వడ పోసి, ఆ నీటిని తలకు రాసుకోవాలి. రోజూ ఇలా చేయాలి. బట్టతల రాదు, వచ్చిన చోట జుట్టు తిరిగి వస్తుంది.
- మందార పువ్వులు, మైదాకు, కలమంద గుజ్జు, నల్ల నువ్వుల నూనెలో వేసి కాచి వడబోసి తలకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా పెరగడమే కాదు తలనొప్పి కూడా తగ్గుతుంది.
- కరివేపాకు రసం, వెల్లుల్లి పొట్టు నల్ల నువ్వుల నూనెలో కాచి పెట్టుకున్నా వెంట్రుకలు పెరుగుతాయి.
- గుంటగలగర ఆకురసం నువ్వుల నూనెలో వేడి చేయాలి. తర్వాత తలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా, వొత్తుగా పెరుగుతాయి.
- ఉసిరి రసం, గుంట గలగర రసం కొబ్బరినూనెలో కలిపి వేడి చేసి తలకు రాయడం వల్ల వెంట్రుకలు రాలవు.