గృహ చిట్కాలు
2. డ్రెస్సును బట్టి లిప్ స్టిక్ కాకుండా శరీర రంగుని బట్టి ముఖానికి వేసుకునే మేకప్ బట్టి లిప్ స్టీక్ రంగులు ని సెలెక్ట్ చేసుకోవాలి ఆప్ లైనరని ఉపయోగించే లిప్స్టిక్ రాసుకోవడం మేలైన పద్ధతి. 3. బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగి నీరు పారబోయకుండా మొక్కల్లో పోయండి అవి పెరటి మొక్కలకు మంచి ఎరువుగా పనిచేస్తాయి. 4. గాజు గిన్నెలో వేడి పదార్థాన్ని పోసే ముందు ఆయా వస్తువులు కింద మెత్తని బట్టఉంచితే పగలకుండా ఉంటాయి. 5. పెంపుడు జంతువులకు ఆహారం పెట్టే పాత్రలలు ప్లాస్టిక్ కాక కుండాస్టీల్ లేదా పింగానివి అయితే క్రిములు చేరకుండా ఉంటాయి. 6. ఐరన్ బాక్స్ అడుగుభాగాన కొద్దిగా పెర్ఫ్యూమ్ దూదితో రుద్ది ఆ తర్వాత బట్టలు ఇస్త్రీ చేస్తే రోజంతా పరిమళం గుబాళిస్తుంది. 7. బట్టల భద్రపరచిన పెట్టెలలో బీరువాలలో కలరా ఉండలు ఉంచితే కీచురాళ్ళు పురుగులు చేరవు. 8. అడపాదడపా పెట్టెలలో లేదా బీరువాలో పెట్టిన బట్టలు వాటికి గాలి సోకని ఇవ్వాలి అలాచేస్తే బట్టలు వాసన చేయవు. 9. కప్పులో నీరుపోసి అందులో కొవ్వొత్తి వెలిగిస్తే త్వరగా కరిగిపోదు 10. కరివేపాకు బాగా నలిపి వంట గదిలో ఉంచితే ఈగలు రాకుండా ఉంటాయి 11. పత్రికల్లో సీరియల్స్ కోసం వ్యాసాలకోసం మొత్తాన్ని ఉంచవద్దు య్మీ కావలసిన పేజీలు కట్ చేసి ఫైల్ చేసుకోండి. 12. కొత్త చెప్పులు మిమ్మల్ని బాధ పెడుతుంటే కరిచిన చోట గ్లిజరిన్ రాయండి నొప్పి తగ్గిపోతుంది 13. బాగా ఎండిన నిమ్మకాయ తొక్కలను వంటింట్లోని బీరువాలో ను వేసి ఉంచితే పురుగులు రాకుండా ఉంటాయి. 14. బెడ్స్ కింద కొన్ని తులసి లేదా వేపాకులు ఉంచండి క్రిములు దరిచేరవు. 15. బొద్దింకలు రాకుండా ఉండాలంటే దోసకాయ చెక్కలను ఎండబెట్టి వాటిన కప్ బోర్డుల్లోనూ అల్మారాలోనూ ఉంచండి.