ఆరోగ్య చిట్కాలు
1. నిమ్మరసంతో ఉప్పును పేస్టులా కలిపి రుద్దుకుంటే పళ్ళమీద గార తగ్గుతుంది. 2. నిమ్మ నారింజ పండు తొక్కలను ఎండబెట్టి మెత్తగా పొడిచేసి దానికి కాస్త ఉప్పు కలిపి పళ్ళపొడి ల ఉపయోగిస్తే పళ్ళు తెల్లగా వస్తాయి. 3. కరివేపాకు బాగా నలిపి వంట గదిలో ఉంచితే ఈగలు రాకుండా ఉంటాయి. 4. బియ్యం కడిగిన నీటిలో చేదుగా ఉండే కాయగూరలు ముక్కలు కడిగితే చేదు తగ్గుతుంది. 5. శరీరంలోని అధికవేడిని తగ్గిస్తూ చలువ చేస్తుంది జామపండు. 6. తల తిరిగినట్లు అనిపించినా తలభారం అనిపించినా అధికంగా ఉన్న అరచెంచా పసుపు అరచెంచా నిమ్మరసం కలిపి తీసుకోవాలి. 7. అజీర్ణంతో బాధపడేవారు రోజూ పరగడుపున ఖర్జూరాలు తింటే మంచిది. 8. యాలకులు నోటి దుర్వాసనను పోగొడతాయి. 9. గొంతునొప్పికి దగ్గుకు జలుబుకు యాలకులు మించిన వైద్యం లేదు. 10. మెంతులు ఆకలిని కలిగించి పోగొడతాయి. 11. 8 వారాలపాటు క్రమంతప్పకుండా మెంతులు కనుక వాడితే బ్లడ్ షుగర్ చక్కగా అదుపులోకి వస్తుంది. 12. నోటిపూతతో బాధపడేవారు పండు టమాటో తింటే నోటిపూత నుంచి ఉపశమనం లభిస్తుంది. 13. పుదీ నా రసం తేనె నిమ్మరసం సమపాళ్ళలో కలిపి అజీర్ణము ఇబ్బంది ఉండదు.