Hair fall remedies.1 ఇలా చేస్తే బట్ట తలరాదు.. వెంట్రుకలు తిరిగి వస్తాయి…
****************************** శిరోజాల సంరక్షణ ఇప్పుడు కష్ట సాధ్యంగా మారింది. దీనికి తోడు కాలుష్యం, నకిలీ షాంపూలు, హానికరమైన కెమికల్స్ జట్టును మరింత దెబ్బతీస్తున్నాయి. పట్టుమని పాతికేళ్ళయినా నిండలేదు…. ఎవరికి కనిపించినా ఎంతమంది పిల్లలని ప్రశ్నిస్తున్నారు. పెళ్ళికాకనే పిల్లలేంటని బాధగా ఉందా…! ఇది ఒకరి సమస్య కాదు. ఇలా బట్టతలతో ఇబ్బంది పడే వారు చాలా మందే ఉన్నారు. వారి బట్టతల చిగురించడానికి ఆయుర్వేదంలో మంచి మార్గలే ఉన్నాయి. బట్టతల రావడానికి అత్యుష్ణమే కారణం. అతి వేడి కారణంగా వెంట్రుకలకు కావాల్సిన కొవ్వు పదార్థం అందక రాలిపోతుంటాయి. ఇందుకు విరుగు అప్పుడే ఆరంభించాలి. పూర్తిగా బోడి అయిన తరువాత ప్రయత్నం చేస్తే ఏ మాత్రం ఉపయోగం ఉండదు. అందుకే ముందుగా జాగ్రత్త తీసుకోవాలి.
- కొద్దిగా కుంకుమపువ్వును పాలతో మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని బట్టతల ఏర్పడిన ప్రాంతంలో అప్లై చేయడం వల్ల సమస్య ఎఫెక్టివ్ గా నివారించబడుతుంది. రాలిపోయిన జుట్టు తిరిగి పెరిగేలా చేస్తుంది.
- బ్లాక్ పెప్పర్ పౌడర్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బట్టతల ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు, ఇక ముందు జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది .
- ఈ మూడు పదార్థాలు మిక్స్ చేసి వేడి నీటిలో వేసి బాయిల్ చేయాలి. ఇది షాంపులాగా తయారవుతుంది. ఈ నేచురల్ షాంపు వాటర్ ను రెగ్యులర్ అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బట్టతలను నివారించడంలో గ్రేట్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీ..
కోకనట్ మిల్క్ లో ప్రోటీన్స్ అందివ్వడంతో పాటు కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నేరుగా తలకు అప్లై చేయడం వల్ల కొత్త జుట్టు మొలవడాన్ని ప్రోత్సహిస్తుంది.