Face glow...
ముఖసౌందర్యం
1. ఒక బంతి పువ్వు తేనె ఒక చెంచా పచ్చి పాలు ఒక చెంచా లేదా మీగడ అన్నిటినీ కలిపి మెత్తగా చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి 20 నిమిషాల పొడి చర్మానికి సాధారణ చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది ఈ ప్యాక్ వారానికి ఒకటి రెండుసార్లు వేసుకోవచ్చు. 2. తాజా కొత్తిమీర రసం 1 స్కూలుకు అర టీస్పూన్ పసుపు కలిపి రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగివేయాలి వారం వారం రోజులు చేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి. 3. ఒక టీ స్పూను పాలమీగడ కు రెండు మూడు చుక్కల నిమ్మరసం కలిపి స్నానం చేయడానికి కనీసం పది నిమిషాల ముందు శరీరానికి పట్టించాలి ఎండాకాలంలో వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది శీతాకాలంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 4. కళ్లకింద నల్లటి వలయాలు పోవాలంటే కోడిగుడ్డులోని తెల్లసొనను పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. 5. పొడిచర్మం వారు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ రెండు టేబుల్ స్పూను పాలమీగడ కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి 6. మీ ముఖానికి ఏ కంపెనీ క్రీములు వాడకుండా ఉంటే మీ చర్మము బాగా నాజూకుగా ఉంటాది, రోమ రంద్రాలు మూసుకో కన్నా ఉంటాయి. 7. ఉదయం పూట పళ్లరసాలు తీసుకోవడం వలన మీ ముఖంలో కాంతి ఉంటాది. 8. పెదవులకు లిప్ స్టిక్ వేయకండి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 9. పచ్చి పసుపులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడగాలి ఇది సహజసిద్ధమైన బ్రిడ్జ్ చర్మాన్ని తెల్లబరుస్తుంది ఎండకు కమిలిన చర్మాన్ని యధాస్థితికి వస్తుంది. 10. మంగు కు తులసి ఆకుల రసం బాగా పనిచేస్తుంది తులసి ఆకులను పేస్ట్ చేసి మచ్చలపై రాస్తే త్వరగా ఫలితం.