Uses of Lemon (part-1)🍋🍋🍋🍋🍋🍋🍋🍋నిమ్మకాయ
విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు అధికం. నిమ్మరసాన్ని నీటిలో కలిపి ఆరోగ్యకర పానీయంగా తాగుతారు. ప్రత్యేకించి ఉదయంవేళ ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగవుతుంది. పాలు లేకుండా టీ తాగేవారు కొద్దిగా నిమ్మరసాన్ని, తేనెను చేర్చి తాగుతారు. ప్రతిరోజూ నిమ్మరసం తాగుతూ వుంటే... వచ్చే ప్రయోజనాలు పరిశీలించండి. 1 అజీర్ణం వలన ఏర్పడే, గుండెమంట, కడుపు ఉబ్బటం, త్రేన్పులు వంటివి రాకుండా వుంటాయి. అమ్మమ్మలు జ్వరం వచ్చినా లేక పొట్ట గడబిడ అయినా ఒక్క గ్లాసు నిమ్మరసంతో వాటిని తగ్గించేవారని మీరు వినే వుంటారు. 2 చర్మ కాంతి - నిమ్మరసం చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. దీనిలోని విటమిన్ సి చర్మాన్ని సంరక్షించి చర్మ కాంతిని కలిగిస్తుంది. నిమ్మరసం రోజూ తాగితే, ఆరోగ్యం మెరుగుపరచి వయసు కనపడనివ్వకుండా కూడా చేస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడంలో అత్యధిక సామర్థం కలిగిన గుణాలు ఉన్నాయి. నిమ్మరసం ముఖానికి పట్టించడం ద్వారా ఎండకు నల్లబడిన చర్మాన్ని తిరిగి నిగారింపు వచ్చేలా చేస్తుంది 3 బరువు తగ్గేందుకు - కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె మిక్స్ చేసి ఉదయాన్ని పరకడుపు తీసుకొన్నట్లైతే శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక ఫ్యాట్ ను బర్న్ చేయడానికి బాగా సహాయపడుతుంది.