సిరి ధాన్యాలతో ( millets) వంటలు
సామలు -అప్పాలు
కావలసిన పదార్థాలు :--- 1.సామలు,పిండి ---1కిలో 2. శనగపిండి. ---100 గ్రాములు, 3.నువ్వులు. .----50 గ్రాములు 4ఓమ/వాము ---30 గ్రాములు 5.కారం. ..50 గ్రాములు 6.ఉప్పు. ..త గినంత 7.వేరుశెనగ నూనె సరిపడినంత తీసుకోవాలి.
తయారుచేయు విధానం :---
సామల పిండి, శనగపిండి నువ్వులు ఓమ, కారం ఉప్పు అన్నిటినీ పొడిగా కలపాలి. వేడినీళ్లలో మురుకులు పిండిలాగా కలుపుకోవాలి. పిండిని చిన్న ఉండలుగా తీసుకుని పలుచని పూరీల్లాగా ఓత్తి వేడి నూనెలో ఎర్రగా వేయించాలి.
లాభాల ,:---సామలు లో పీచు పదార్థం 9.8 , ప్రొటీన్ 7.7, ఐరన్ 2.8, క్యాల్షియం 0.02, ఖనిజాలు 1.5,ఐరన్ 2.8. ఉన్నాయి.
పీచు పదార్థం అధికంగా కలిగి ఉండటం వలన జీర్ణక్రియ బాగా జరిగి మలబద్దక సమస్య లేకుండా ఉంటారు. హెచ్చుస్థాయిలో శక్తినిచ్చి చురుకుదనాన్ని కలిగిస్తుంది.
గమనిక :----ఊదలు,అరికలు,కొర్రలు, అండు కొర్రలు ఈ విధముగా చేసుకోవచ్చు
--------------------------------------- ---- స్త్రీల యొక్క అన్ని కుసుమ రోగాలు తగ్గడానికి. మేడి చెక్క 50 గ్రాములు ఒక గ్లాసు నీళ్లలో వేసి రాత్రి నానబెట్టి ఉదయం సగమయ్యే వరకు మరిగించి దానిలో తాటి బెల్లం ఒక చెంచా కలుపుకొని తాగుతుంటే అన్ని రకాల ,కుసుమవ్యాధులు తగ్గును