Is? cold water! Best for bath (స్నానం)
అవును అంటున్నాయి అనేక పరిశోధనలు. చన్నీటిస్నానం కారణంగా బరువు తగ్గుతారట. అదెలా అంటే- చల్లని నీటితో స్నానం చేశాక మళ్లీ శరీరం వేడెక్కాలంటే మరిన్ని క్యాలరీలు అవసరమవుతాయి. దాంతో జీవక్రియా వేగం పెరుగుతుంది. ఫలితంగా శరీరంలోని కొవ్వు కరిగి వేడి పుడుతుంది. అందుకే రోజూ చన్నీళ్ల స్నానం చేస్తే ఏడాదికి నాలుగు కిలోల బరువు తగ్గుతారట. పైగా చల్లని నీళ్లవల్ల శరీరం వణుకుతుంది. అంటే కండరాల్లో కదలిక ఉంటుంది. ఫలితంగా అవన్నీ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఇంకొన్ని క్యాలరీలు ఖర్చవుతాయి. అందుకే పాశ్చాత్య దేశాల్లో బరువు తగ్గడానికి ఐస్‌బాత్‌లకి వెళుతుంటారు.
చన్నీటి స్నానంతో లింఫటిక్ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.చల్లని నీరు నేరుగా లింఫ్ రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. దాంతో అవి చురుగ్గా మారతాయి. చల్లదనానికి ఆ రక్తనాళాలు సంకోచించి మళ్లీ వ్యాకోచిస్తుంటాయి. ఈ ప్రక్రియ కారణంగా శరీరంలో పేరుకున్న ఇన్ఫెక్షన్లూ టాక్సిన్లూ రసాయనాలూ అన్నీ బయటకు పోతాయి. ఈ లింఫటిక్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే చాలామంది తరచూ జలుబుబారిన పడుతుంటారు.
చన్నీటి స్నానం వల్ల ఒత్తిడికి కారకమైన హార్మోన్ల విడుదల తగ్గుతుంది. దాంతో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. పైగా చర్మమూ జుట్టూ ఆరోగ్యంగా మృదువుగా ఉంటాయి. చల్లనినీళ్లు స్వేదరంధ్రాల పరిమాణాన్ని తగ్గిస్తాయి. దాంతో చర్మం బిగుతుగా మారి, నూనె విడుదల చేయకుండా ఉంటుంది. ఫలితంగా చర్మం జిడ్డు కారకుండానూ ఆరోగ్యంగానూ ఉంటుంది. అదేసమయంలో పొడిచర్మం వాళ్లకీ ఇది మంచిదే.
రక్తప్రసరణ వేగంతోబాటు ఊపిరి తీసుకునే వేగం పెరుగుంది. ఫలితంగా శరీరంలో చురుకు పుడుతుంది. (Note) Depends on different bodies, Atmosphere