థైరాయిడ్ సమస్య యొక్క ప్రధానమైన 12 నిశ్శబ్ద సంకేతాలు:
*1. విచారం మరియు డిప్రెస్డ్(తీవ్రమైన ఒత్తిడి) ఫీలింగ్*
థైరాయిడ్ యొక్క నిశ్శబ్ద సంకేతాలలో ఒకటి నెర్వస్ ఫీల్. ఎక్కువగా ఒత్తిడికి లోనైనభావన, విచారం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. మెదడు తీవ్రమైన ఉద్దీపనకు లోనైన సమయంలో ముఖ్యంగా ఇలా జరుగుతుంది. ముఖ్యంగా మీకు నచ్చని అంశాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆవేశానికి లోనవడం వంటి సమస్యలను ఎదుర్కోవడం తరచుగా జరుగుతుంది.
*2. మలబద్దకం*
తరచుగా మలబద్ధకాన్ని ఎదుర్కోవడం మరొక నిశ్శబ్ద సంకేతం. థైరాయిడ్ హార్మోన్లు మీ జీర్ణాశయాన్ని సరిగ్గా పనిచేసేలా సహాయపడుతాయి. థైరాయిడ్ గ్రంధి హార్మోనుల అసమతౌల్యం, మరియు జీర్ణక్రియలను అస్తవ్యస్త పోకడలకు గురిచేయవచ్చు. క్రమంగా జీర్ణాశయ పనితీరు మందగించి, మలబద్దక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి
*3. అతినిద్ర*
పగటిపూట అలసిపోవడము, తరచుగా నిద్రపోవడం అనేది థైరాయిడ్ సమస్య ప్రాధమిక గుర్తుగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథులు శరీరానికి శక్తిని అందించే థైరాయిడ్ హార్మోన్లను సరైన మోతాదులో ఉత్పత్తి చేయలేక పోయినప్పుడు, నిస్తేజానికి లోనవడం మూలంగా అతినిద్ర సమస్యలు కలుగుతుంటాయి.
*4. జుట్టు నష్టం మరియు పొడి చర్మం*
అధిక జుట్టు నష్టం, ముఖ్యంగా కనుబొమ్మల మీద ప్రభావం కలిగి ఉండడం, థైరాయిడ్ రుగ్మత యొక్క చిహ్నం. మితిమీరిన లేదా క్రియారహితమైన థైరాయిడ్ గ్రంధి మీ జుట్టు పెరుగుదల మీద తీవ్రప్రభావాన్ని చూపుతుంది. థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత, సాధారణంగా జుట్టు సన్నబడటానికి ప్రధాన కారకం.
*5. ఆకస్మికంగా బరువు పెరుగుట*
థైరాయిడ్ హార్మోన్ల కొరత జీవక్రియలను తగ్గించడమే కాకుండా, కాలరీలను తక్కువగా కరిగించేలా చేస్తుంది, క్రమంగా శరీరంలో కొవ్వు పేరుకుని పోవుట, ఊబకాయానికి గురికావడం వంటి సమస్యలు కలుగుతుంటాయి.