Skip to content
Hyderabad, Telangana, 500092

Business hours

International Sujok Chiropractic therapy centre Hyderabad

Monday
6am-8pm
Tuesday
6am-8pm
Wednesday
6am-8pm
Thursday
6am-8pm
Friday
6am-8pm
Saturday
6am-8pm
Sunday
6am-8pm

You can anytime during the day with your query.

8498905470

మధుమేహం2' - ఈ రోగాన్ని తగ్గించుకొని, ఆరోగ్యవంతులవడానికీ,దాన్ని దూరం గా ఉంచేందుకు సూత్రాలు:

i) 8 నుండి 12.5% పీచు పదార్థం లేదా ఫైబర్ కలిగిన 'సిరి ధాన్యాలను' (5 మిల్లెట్ లు) ముఖ్య ఆహారం గా స్వీకరించడం. వరి, గోధుమల లో పీచు పదార్థం/ఫైబర్ ౦.2 నుండి 1.2 మాత్రమే ఉండటమే కాక అది ధాన్యపు పై పొరలలోనే ఉండబట్టి పోలిష్ చేస్తే పోతోంది. కానీ సిరిధాన్యాలలో పీచుపదార్థం లేదా ఫైబర్ ధాన్యపు కేంద్రంనుండి బయటి వరకూ, పిండిపదార్థం లో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటం లో పూర్తి దోహదం చేస్తుంది. ఇది తెలుసుకుంటే మన ఆరోగ్యాలు కాపాడుకోవటం లో సులువు తెలిసినట్లే. రోజు కొకటే సిరిధాన్యాన్ని బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలకు వాడాలి.(అదే ధాన్యాన్ని) ఇలా 5 ధాన్యాలనూ రోజూ మార్చుకోవాలి. వీటి తో అన్నం వండుకోవచ్చు, రొట్టె లు చేసుకో వచ్చు, ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోస, బిరియాని, బిసిబేళ్ల బాత్ కూడా చేసుకోవచ్చు. కుటుంబం లో అందరికీ చిన్న నాటి నుండే వీటి యందు అవగాహన పెంచటం.

ii) రోజూ 50 నుండి 70 నిముషాలు నడవటం.

iii ) జామ, మామిడి ఆకులూ, రావి, పారిజాతం కషాయాలను మూడు పూటలా సాధ్యమైనంత ఖాళీ కడుపు పై త్రాగటం. అధికం గా ఆకూ కూరలూ, సేంద్రియ ఆహారం సహజ రూపం లో తినడం.

iv ) మునగ ఆకూ, కాయలూ, మెంతులూ, మెంతికూర, ఆలో వేరా, కాకర కాయ, బెండ కాయ, జామ కాయ, ముల్లంగి, అరటి కాయ, శనగలూ, పెసలూ తరచుగా వాడుకోవటం.

v ) పాల వాడకం మానివేయడం.పెరుగు, మజ్జిగ ల రూపంలోనే వాటిని స్వీకరించటం. కొని తినే ప్యాకెడ్ ఆహారాలను దూరం పెట్టడం,

vi) మైదా, మైదా వేసిన ఆహారాలూ, రిఫైన్డ్ నూనె లను దూరం గా ఉంచడం, గానుగ నూనెలో, organic cold-pressed నూనెలో వాడుకోవడం.