పులిచింత ఆకు
పులిచింత ఆకు
*శాస్త్రీయనామం :జల ఆక్పాలిస్ కాలిక్యులాట *కుటుంబం: ఆక్సాలిడేసి *సంస్క నామం: చాంగేరి తెలుగు :పులిచింత లాభములు :---
1. మొక్కసమూలం మెత్తగా నూరి పూసిన కుళ్ళిన ప్రణములు, గాయములు మానును. 2 సమూలం నీటిలో వేసి కాచి ఆ కషాయమును నోటిలో 10 నిమిషములపాటు పుక్కిలించిన కదులుతున్నపళ్ళుగట్టిపడును. 3. తేలుకుట్టిన ప్రదేశములో పులిచింతరసమునందు సైంధవ లవణం చేర్చి రుద్దిన తేలు విషము దిగును. 4. పులిచింత ఆకురసమునందు సైంధవలవణము కలిపి పూసిన పులిపిర్లు వూడును. 5 ఆకులను వేడి నీటిలో నూరి రసముతీసిఅందుఉల్లిపాయలరసమును కలిపి తలకు పూసిన పైత్యపుతలనొప్పి తగ్గను. 6 దీని ఆకులతో చేసిన పచ్చడిని వాడుచున్న ఆకలి వృద్ధి అగును. రుచికరంగా వుండును. ఉబ్బు వ్యాధులవారికి మేలుచేయును. 7. అమీబియాసిస్ సమస్య ఉన్నవారికి దీనిని వాడుతుంటే చాలా లాభదాయకంగా ఉంటాది 8. పచ్చి ఆకులు నమిలి తిన్న గ్యాస్ సమస్య తగ్గులు 9. పప్పులోపులుపు బదులు ఇది వేసుకొని వండుకోవచ్చు 10. ఇది తినడానికి చింతాకుల పుల్లగా ఉంటాది. 11. నీళ్ల తడి ఎక్కడ బాగుంటాదో, సహజంగా చెట్టు మలుస్తూ ఉంటది
సేకరణ: డాక్టర్. సి హెచ్ రామకృష్ణ రెడ్డి