*మధుమేహం టైపు 2 -సిరి ధాన్యాలు -కషాయాలు :*
నేడు మీరిక మధు మేహానికి బానిసలు కానక్కర లేదు : ఆరోగ్యాన్ని కాపాడుకోండి !
నేడు భారత దేశం లో 7 నుండి 10 కోట్ల ప్రజలకు DIABETES-2 సోకింది. (కొందరు నిపుణులు దీనికి రెండింతలు సంఖ్య ను చెప్తారు ప్రీ-Diabetics ని కూడా చేర్చి ).వీరంతా నెల నెల మందుల పై ఎంత ఖర్చు పెడతారో ఊహించండి. Cost of diabetes hits 825 billion dollars a year !! కాల క్రమేణా మందులు దాటి ఇన్సులిన్ ఇంజక్షన్ ల వైపు, ఇంకా అది దాటి కిడ్నీ సంబంధ సర్జరీ లకు కొన్ని పదుల లక్షల రూపాయల ఖర్చు వైపు వెళ్లాల్సి వస్తుంది.
మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు కొన్ని:
తీవ్రత తో కూడిన జీవన శైలి, ఆత్మీయుల మరణం , ఉద్రేకాలు, ఉద్వేగాలు; emotions, వ్యాపారం లో నష్టాలూ, ప్రేమ వైఫల్యాలు , పట్టుదలలూ, ఆవేశాలు, పంతం తో బ్రతకటం, తీవ్ర అవమానాలకు గురికావడం మైదా, రిఫైన్డ్ కల్తీ నూనెలూ, తెల్ల చక్కర పదార్థాల వాడకం, పీచు పదార్థం లేని ఆహార దినుసులను ముఖ్య ఆహారం గా సేవించడం, అధికం గా తెల్ల చక్కర పదార్థాలు వేసిన డ్రింకులూ, ఆహారం తినటం, పీచు పదార్థం లేనిదైన మాంసం, ఆల్కహాల్ ల సేవనం, వందల కొద్దీ రసాయనాలు వేసిన -ప్యాక్ చేసిన ఆహారాలు కొనుక్కొని తినడం, క్లోమ గ్రంధి ని ఆవహించిన ఇన్ఫెక్షన్ లూ, అంటి బయాటిక్ ల విపరీతఫలితాలు ఇందుకు చెప్పుకో దగ్గ కొన్ని కారణాలు.
గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే 'మధు మేహం' మరో పది రోగాలను ఆహ్వానిస్తుంది. అది కళ్ళ కూ, మూత్ర పిండాలకూ, ఎముకలకూ, హృదయానికి, పునరుత్పత్తి మండలాలకు, మెదడు కూ కూడా రోగాలు తెచ్చి పెడ్తుంది.
'