కీళ్ల నొప్పులు కాళ్లు తీపులు
******************** 1. వావిలి ఆకులను దంచి ముద్దకుసమానముగా నువ్వుల నూనె తీసుకొని అందులో వేసి తడి పోయేంత వరకు కాచి, వీటిని చల్లార్చి ఆ నూనెను పైన మర్దన చేసిన కీళ్లనొప్పులు తగ్గుతాయి. 2. వెల్లుల్లి 2,3 పాయలను తొక్కుతీసి అరకప్పు పాలలో కాచి రాత్రి రోజు తాగినా కీళ్ల వాపులు,కీళ్లనొప్పులు తగ్గుతాయి. 3. కానుగ చెట్టుపట్ట దంచి రసం తీసి 20ml రోజుకొకసారి తాగితే కీళ్ల వాపు నొప్పి తగ్గుతుంది. 4. నల్లేరు కాడ లేతది పచ్చడి చేసుకుని తింటే కిళ్ళ నొప్పులు,కాళ్ల నొప్పులు తగ్గుతాయి 5నెమలి ఆకు రసం 20ml సేవిస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 6. పారిజాతం ఆకులు అయిదు ఒక గ్లాసు నీళ్లలో వేసి సగం అయ్యేవరకు మరిగించి ఉదయం సాయంత్రం త్రాగుట వలన మోకాళ్ళ నొప్పులు తగ్గును. 7. తుమ్మబంక ఒక చెంచా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో వేసి ప్రతిరోజూ సేవించుటవలన,అన్ని రకాల వాత నొప్పులు తగ్గును.