వాము తో ఆరోగ్యం
1.వాము -100 గ్రాములు 2.మిరియాలు -50 గ్రాములు 3.ఉప్పు(ఏదన్నా వాడవచ్చు)25గ్రాములు పై3 కలిపి దోరగా వేయించి చూర్ణంచేసి కొని నిలువచేసుకోవాలి వాడేవిదా నం :-- భోజనం చేసి పావుగంట ఆగి అర చెంచా గోరువెచ్చని నీళ్లలో కలపి సేవించాలి లాభాలు :-- గ్యాస్, కడుపునొప్పి కడుపుబ్బరం,అజీర్ణం మొదలగునవి తగ్గును. 2 వా ము10గ్రాములు,నీళ్లు60ml చిన్న గిన్నెలో వేసి సన్న మంట మీద వేడి చేయాలి కోవాలి ఆ నీళ్లు 15 ml చొప్పున ప్రతి రెండుగంటలకోసారి ఇచ్చుచున్న నీళ్ళ విరేచనాలు Diarrhoea తగ్గును. 3 వామును దోరగా వేయించి అందులో కొంచెం ఉప్పు చేర్చి చూర్ణించి ప్రతిదినము చిన్నపిల్లలకు వారి ఆహారంతో తినిపిస్తే అజీర్ణ తత్వము గల పిల్లలకు తత్వము మారి జీర్ణశక్తి పెరుగుతుంది. 4. దంత రోగము తగ్గుటకు వాము వస వీని ని ముద్దగా నూరి దంత చిగుళ్లుకు పూసిఒక రాత్రంతా ఉంచుకోవాలి. 5. టాన్సిల్స్ వాపు తగ్గడానికి వాము రాత్రింబవళ్లు నోటియందు ధరించి రసాన్ని కొద్దిగా,కొద్దిగా మింగుతుండాలి.